తాజా వార్తలు

ఇది ప్రజల ఏకపక్ష తీర్పు.. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నియోజకవర్గంలోనే..

ఇది ప్రజల ఏకపక్ష తీర్పు.. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నియోజకవర్గంలోనే..
X

ప్రాదేశిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని అన్నారు టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. రాష్ట్రంలోని 32 జిల్లా పీఠాలను కైవసం చేసుకోవడం టీఆర్‌ఎస్‌కు గర్వకారణమన్నారాయన. ఫలితాల్లో విజయదుందుభి మోగించిన అనంతరం స్పందించిన కేటీఆర్‌.. ఈ గెలుపు తమపై మరింత బాధ్యత పెంచిందన్నారు.

పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌వైపు ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను తలదన్నేలా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారని ఆయన అన్నారు. స్వాతంత్య్రానంతరం నిర్వహించిన ఏ ఎన్నికల్లోనూ ఇలాంటి ఏకపక్ష తీర్పు రాలేదన్నారు కేటీఆర్‌టీఆర్‌ఎస్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద విజయమన్నారు కేటీఆర్‌. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సొంత నియోజకవర్గంలో 7 జడ్పీటీసీ స్థానాలుంటే అందులో 5 తెరాస కైవసం చేసుకుందన్న కేటీఆర్‌... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నియోజవర్గం మధిరలోని ఐదింటిలో నాలుగు స్థానాల్లో గులాబీ జెండా ఎగరేశామన్నారు.

గెలిచినా..ఓడినా టీఆర్‌ఎస్‌ ఎప్పుడూ ఒకేలా ఉంటుందన్నారు కేటీఆర్‌. ఇది విజయం కాదని.. ప్రజలు తమపై పెట్టిన బాధ్యతన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలకు, ఈ ఎన్నికలకు ఓటింగ్‌లో తేడా కనిపించిందన్న ఆయన.. 4 ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.టీఆర్ఎస్‌కు క్షేత్రస్థాయిలో ఎంత పటిష్టమైన పునాది ఉందో ఈ ఫలితాలే నిదర్శమన్నారు కేటీఆర్‌. ఎన్నికల్లో కష్టపడ్డ జిల్లా పార్టీ ఇన్ ఛార్జిలకు, నేతలకు , కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

Next Story

RELATED STORIES