జగన్‌ నిర్ణయానికి పోలీసుల్లో ఆనందం..పాదయాత్ర సమయంలో..

జగన్‌ నిర్ణయానికి పోలీసుల్లో ఆనందం..పాదయాత్ర సమయంలో..

శాంతిభద్రతల పరిరక్షణలో అలుపెరుగకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వీక్లీఆఫ్‌ ఇస్తామన్న సీఎం జగన్‌ ఇచ్చిన హామీకి కదలికి వచ్చింది. ఇందుకు సంబంధించి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఆ దిశగా చర్యలు చేపట్టడంతో పోలీసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వాస్తవానికి చంద్రబాబు..... పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇస్తామని హామీ ఇచ్చినా.... దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అప్పటి డీజీపీ నండూరి సాంబశివరావు ప్రయత్నాలు చేసినప్పటికి ఆ తర్వాత ఈ అంశం మరుగునపడింది.

జగన్‌ పాదయాత్ర సమయంలో.. పలువురు పోలీసులు, హోంగార్డులు ఆయన్ను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చాక వీక్లీఆఫ్‌లు, హోంగార్డులకు మెరుగైన వేతనాలు ఇస్తామంటూ అప్పట్లో హామీ ఇచ్చారు జగన్‌. ముఖ్యమంత్రి అయిన వెంటనే సీఎం జగన్‌...... ఆ దిశగా చర్యలు చేపట్టారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ సవాంగ్‌ 22 మంది పోలీసుల ప్రతినిధులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటికీ శాంతిభద్రత ఏడీజీ ఛైర్మన్‌గా ఉంటారు.

పోలీస్‌ శాఖలోని అన్ని విభాగాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఏ విభాగాంలో ఏ రోజు వీక్లీఆఫ్‌ అమలు చేయాలని, దీని అమలులో ఇబ్బందులేంటి,? వీటిని అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న కోణాల్లో ఈ కమిటీ పరిశీలిస్తుంది. వారం రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని, దాని ఆధారంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ను ప్రభుత్వం అమలు చేస్తుందని డీజీపీ తన సర్య్కూలర్‌లో వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story