సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం.. అలా చేస్తే జైలుకే...

నకిలీ విత్తనాల చలామణీపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకడవద్దన్నారు. అవసరమైతే అసెంబ్లీలో చర్చించి.. విత్తనచట్టంలో మార్పులు చేద్దామన్నారు. అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలు వ్యవసాయ రంగం అవసరాలకు ప్రధాన కేంద్రం చేసే ఆలోచన ఉందని.. అధికారులకు వివరించారు. వ్యవసాయశాఖపై సమీక్ష సందర్భంగా.. ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు.

రాష్ట్రంలో వినియోగించే విత్తనాలు, ఎరువులు, మందుల పంపిణీ గ్రామా సచివాలయాల ద్వారా జరిగేల చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించించారు ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వం సేవలు అందించిందీ అంటే దానికో ప్రత్యేక బ్రాండ్ పడాలని, రైతులకు ప్రభుత్వ సేవలపై విశ్వసనీయత పెంచాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు గ్రామా సచివాలయాల ద్వార రైతులకు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అవినీతి జరిగిందంటే కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఉత్తమమైన సలహాలు ఇస్తే సంతోషిస్తానని... అటువంటి వారికి సన్మానం చేస్తామని ప్రకటించారు.

ిఇక.. ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతులకు తాను ఇచ్చిన హామీల అమలుపైనా అధికారులతో చర్చించారు జగన్. పంటల గిట్టుబాటు ధర కోసం 3 వేల కోట్లతో స్థీరికరణ నిధి ఏర్పాటు చేయడం.. రైతులకు ఉచిత బోర్లు...... నాలుగు దశల్లో రైతుకు పెట్టుబడి సాయం కింద 12 వేల 500 రూపాయలు ఇవ్వడం లాంటి వాటిపై నివేదికలు సిద్ధంచేయాలన్నారు. వ్యవసాయ శాఖ సమీక్ష ముగిసిన అనంతరం ఇరిగేషన్‌ శాఖపై జగన్‌ సమీక్ష చేయనున్నారు. ముఖ్యంగా పోలవరం పనులపై దృష్టి సారించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story