నా బిడ్డ మరణానికి వారే బాధ్యులు: తేజ

నా బిడ్డ మరణానికి వారే బాధ్యులు: తేజ
X

అనారోగ్యంతో బాధపుతున్న నా నాలుగేళ్ల బిడ్డని బ్రతికించుకోవడం కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. డాక్టర్స్ తప్పిదం వల్ల నా బిడ్డ అనారోగ్యం పాలయ్యాడు. మెరుగైన వైద్యం అందిస్తే బిడ్డ బతుకుతాడేమోనని ఆశతో చైనా, జపాన్ దేశాలకు కూడా తీసుకువెళ్లా.. అయినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో ఇంటినే హాస్పిటల్‌గా మార్చేశాము. నాలుగేళ్లపాటు నేను, నా భార్య నిద్రలేని రాత్రులు గడిపాము. 24 గంటలపాటు మూడు షిప్టులలో ఇద్దరిద్దరు నర్సులు బాబుని కంటికి రెప్పలా కాపాడేవారు. ఆక్సిజన్ మిషన్, జనరేటర్, క్లీనింగ్ మిషన్ లాంటి పరికరాలతో ఇల్లంతా హాస్పిటల్లా ఉండేది. అయినా నా కొడుకు ఆరోగ్యం మెరుగవలేదు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాధలో ఉండి నాలుగేళ్ల వరకు సినిమాలు చేయలేకపోయాను. చాలా మంది చెప్పారు హాస్పిటల్ మీద కేసు వేయమని. పోయిన నా కొడుకు తిరిగి వస్తాడా అని వేయనన్నాను. తేజ కొడుకు మరణానికి బాధ్యులైన వారెవరో తెలియజేస్తూ అప్పట్లో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Chat conversation end

Next Story

RELATED STORIES