సెలవు రోజుల్లోనూ ఆఫీస్‌కి వెళ్లి అందరి తాట తీస్తున్న మినిస్టర్

సెలవు రోజుల్లోనూ ఆఫీస్‌కి వెళ్లి అందరి తాట తీస్తున్న మినిస్టర్

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అఖండ మెజారిటీ సాధించిపెట్టడంలో అమిత్ షా పాత్ర ఎంతో కీలకం. చేపట్టే ఏ పనైనా అంతఃకరణ శుద్ధితో పూర్తి చేయడం ఆయన స్టైల్. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తనదైన మార్క్ తో హోం శాఖను పరుగులు పెట్టిస్తున్నారు.

ఒక్కసారి కేంద్రమంత్రి అయితే షెడ్యూల్డ్ చాలా బిజీ. రోజంతా తీరికలేని పనులు. రాష్ట్రాల్లో పర్యటనలు, కేంద్రమంత్రులతో భేటీలు. ఇలా ఒకటేమిటి క్షణక్షణం అంతా టైట్ షెడ్యూల్. హోంమంత్రి పదవైతే ఇంకా ఎన్నో కీలక బాధ్యతలు. అలాంటి పదవిలో అమిత్ షా తన మార్క్ చూపిస్తున్నారు. ఢిల్లీ నార్త్ బ్లాక్ లోని హోంశాఖ హెడ్ క్వార్టర్స్ కార్యాలయ సిబ్బంది అమిత్ షా రాకతో ఊపిరి సలపనంత బిజీ అయ్యారు. పంక్చ్యవాలిటీకి మారు పేరుగా నిలిచే అమిత్ షా... ఉదయం 10 గంటలకల్లా హోంశాఖ కార్యాలయంలో ప్రత్యక్షమవుతున్నారు. సెలవు రోజుల్లోనూ ఆఫీస్ వెళ్లి అందరి తాట తీస్తున్నారు. గురువారమైతే ఏకంగా 9 గంటల 40 నిమిషాలకే ఆఫీసులో అడుగుపెట్టారు. ఇక రాత్రి కూడా కనీసం 8 గంటల తర్వాతే బయటకెళ్తున్నారు.

ఇంతటి పనిరాక్షసుడిని తమ సర్వీసులో చూడలేదంటున్నారు హోంశాఖ సిబ్బంది. విశేషమేమిటంటే... కార్యాలయ అధికారులు, సిబ్బందితోపాటు ఇద్దరు జూనియర్ మంత్రులు కూడా ఎక్కువ గంటలు ఆఫీస్ లో గడుపుతున్నారు. అమిత్ షా కు ముందు పనిచేసిన రాజ్ నాథ్ సింగ్ లంచ్ కు ఇంటికి వెళ్లేవారు. కానీ అమిత్ షా లంచ్ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు షార్ప్ గా ఆఫీస్ కు వచ్చేస్తుంది. సో... లంచ్ టైమ్ ను కూడా అమిత్ షా ఎక్కువగా వేస్ట్ చేయడంలేదు. రంజాన్ గవర్నమెంట్ హాలిడే అయినప్పటికీ... ఆ రోజు కూడా అమిత్ షా ఆఫీస్ కు వెళ్లారు. సాక్ష్యాత్తు కేంద్ర మంత్రే ఆఫీసుకు రావడంతో సెలవు రోజైనా మిగిలిన మంత్రులు, సిబ్బంది ఆఫీసుకెళ్లి ఎస్ బాస్ అన్నారు.

అమిత్‌ షా డిసిప్లీన్ హోంశాఖ అధికారులకు కొత్తకానీ, పార్టీ నేతలకు కాదు. అమిత్ షా తో నిత్యం టచ్ లో ఉండే నేతలంతా రాత్రిపూట పెన్ను పేపర్ పక్కలో పెట్టుకుని పడుకుంటారని చెప్పుకుంటారు. అర్థరాత్రి ఏదైనా ముఖ్య విషయం గుర్తుకొచ్చినా... అమిత్ షా నేతల్ని లేపేవారని చెబుతారు. లేట్ నైట్ అయినా డెడ్ లైన్ లు టాస్క్ లు ఉండేవట. ఫుల్ టైమ్ ఆఫీసులో ఉండే బాస్ రావడంతో... హోంశాఖ కార్యాలయ సిబ్బంది కూడా అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు.

గత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రైసినా హిల్స్ ఆఫీస్ లో మధ్యాహ్నం వరకు పనిచేసేవారు. ఆ తర్వాత కీలక సమావేశాలన్ని ఇంట్లోనే నిర్వహించేవారు. అమిత్ షా మాత్రం అన్ని కీలక సమావేశాలన్నీ ఆఫీస్ లో నిర్వహిస్తున్నారు. వివిధ పారామిలిటరీ బలగాల చీఫ్ లకు అమిత్ షా తో కలిసే అవకాశం ఉంటోంది. కానీ... రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులకు మాత్రం... మినిస్టర్ బిజీ అని వినిపిస్తోంది.తన కింద ఉన్న 19 విభాగాల అధిపతులకు నిత్యం టాస్క్ లు ఇచ్చి... ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయమని అమిత్ షా ఆడుకుంటున్నారు. కేబినెట్ మొత్తంలో అత్యధికంగా 8 కేబినెట్ కమిటీల్లో అమిత్ షా సభ్యుడిగా ఉండగా ప్రధాని మోదీ 6 కేబినెట్ కమిటీల్లో ఉన్నారు. బాధ్యతలు కేంద్ర హోం మంత్రివే అయినప్పటికీ... దాదాపు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లా పరిస్థితి ఉందని నార్త్ బ్లాక్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story