తాజా వార్తలు

టీఆర్ఎస్ నాయకులపై చెప్పుతో దాడి చేసిన కాంగ్రెస్ మహిళా నేత

ఎంపీపీ క్యాంప్ రాజీయాల్లో తలెత్తిన వివాదంతో ఓ కాంగ్రెస్ మహిళ నేత టీఆర్ఎస్ నాయకులను చెప్పుతో కొట్టింది. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ నుంచి ఎంపీటీసీగా ఎన్నికైన రజితను కాంగ్రెస్ నాయకులే కిడ్నాప్ చేశారని ఆమె భర్త భిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే..రజిత మాత్రం తాను కాంగ్రెస్ వారితోనే ఉన్నానని తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని తేల్చి చెప్పేసింది. రజిత స్టేట్ మెంట్ తో సీన్ మారిపోయింది. విచారణ పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ఎంపీటీసీ రజిత మీదకు కొందరు టీఆర్ఎస్ నాయకులు దూసుకురావటంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు వెనక్కి తగ్గకపోవటంతో స్థానిక నేతలను చెప్పుతో కొట్టారామె.

Next Story

RELATED STORIES