Top

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
X

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేశారు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి. పాపిరెడ్డి. జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి క్యాంపస్‌లోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ వీసి వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ ఎన్‌. యాదవ్‌తో పాటు ఇంటర్‌ అధికారులు పాల్గొన్నారు.

ఇంటర్‌ ఫలితాలను ఇంటర్ బోర్డు ఎంసెట్‌ కమిటీకి అందజేయగా.. ఎంసెట్‌ ఫలితాలను ఆదివారం విడుదల చేశారు అధికారులు. ఇంటర్‌లో వచ్చిన మార్కుల్లో 25 శాతం ఎంసెట్‌లో వెయిటేజీ ఉంటుంది.. కాబట్టి ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలంటే ఇంటర్ మార్కుల్ని జేఎన్టీయూకు ఇంటర్ బోర్డు అందించాలి. ఇంటర్ బోర్డు విద్యార్థుల మార్కుల్ని జేఎన్టీయూకు పంపడం ఆలస్యం కావడంతో ఎంసెట్ ఫలితాలు కూడా ఆలస్యం అయ్యాయి.

ఎంసెట్ పరీక్షకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షా 42వేల216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో లక్షా 31వేల 209 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగానికి మే 3వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు జరిగాయి.

Next Story

RELATED STORIES