Top

అమెజాన్‌లో ఉద్యోగాలు.. స్టూడెంట్స్‌, హోం మేకర్స్‌, రిటైర్డ్ ప్రొఫెషనల్స్‌.. ఎవరైనా అప్లై..

అమెజాన్‌లో ఉద్యోగాలు.. స్టూడెంట్స్‌, హోం మేకర్స్‌, రిటైర్డ్ ప్రొఫెషనల్స్‌.. ఎవరైనా అప్లై..
X

ఆన్‌లైన్ మార్కెట్.. అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే కోరుకున్న వస్తువు క్షణాల్లో మన కళ్ల ముందు ఉంటుంది. ఇక సమ్మర్ సేల్, విటర్ సేల్ లేదంటే

ఏదో ఒక అకేషన్ క్రియేట్ చేసి మరీ కస్టమర్లని ఆకర్షించడానికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తుంది. మరి ఈ ప్రొడక్ట్‌లన్నీ సకాలంలో డెలివరీ చేస్తేనే కదా

వినియోగదారుడు మళ్లీ మళ్లీ కొనడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం డెలివరీ బాయ్‌లు చాలా మందే కావాలి. అందుకే అమెజాన్ ఇండియా కొత్తగా పార్ట్ టైం జాబ్స్‌కి శ్రీకారం చుట్టింది. ఎవరైనా ఓకే.. కానీ కస్టమర్ కోరిన వస్తువుని సేఫ్‌గా, టైమ్‌కి అందించాలి అంటోంది. ముఖ్యంగా స్టూడెంట్స్‌కి, హోం మేకర్స్‌కి, రిటైర్డ్ ప్రొఫెషనల్స్‌ని అప్లై చేసుకోమని కోరుతోంది.

Amazon Flex పేరుతో కంపెనీ వేలాది మందికి జాబ్ అవకాశాలను కల్పించాలనుకుంటోంది. పాకెట్ మనీ కోసం అమ్మానాన్న దగ్గర చేయి చాచకుండా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు స్టూడెంట్స్. రోజుకి 4 గంటలు పని చేస్తే చాలు. గంటకు రూ.120 నుంచి రూ.140లు ఇస్తుంది సంస్థ. ప్రతి బుధవారం ఈ మొత్తాన్ని ఆవ్యక్తికి అందజేస్తుంది అమెజాన్. భారత్‌తో పాటు ఉత్తర అమెరికా, జర్మనీ, స్పెయిన్, జపాన్, సింగపూర్, యూకే దేశాల్లో ఈ సర్వీస్ రన్ చేస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు, బుక్ చేసిన ఐటెం వేగంగా డెలివరీ చేసేందుకు ఈ సర్వీసు ఎంతో ఉపయుక్తంగా ఉందని ఆసియా కస్టమర్ ఫుల్ ఫిల్మెంట్ వైస్ ప్రెసిడెండ్ అఖిల్ సక్సేనా అంటున్నారు.

Next Story

RELATED STORIES