Top

పదవతరగతి అర్హతతో ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు జూన్ 24

పదవతరగతి అర్హతతో ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు జూన్ 24
X

కేంద్ర ప్రభుత్వానికి చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ AIESLసంస్థలో యుటిలిటీ హ్యాండ్ పోస్టుల భర్తీ చేయదలిచింది సంస్థ. 5ఏళ్ల అనుభవం తప్పనిసరి. లైట్ కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 24లోగా దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం పోస్టులు : 40.. జనరల్: 23.. ఓబీసీ: 10.. ఎస్సీ: 04.. ఎస్టీ: 03.. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 24 దరఖాస్తు ఫీజు: ఓబీసీ, జనరల్ కేటగిరి అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజులేదు. "Air India Engineering Services Limited, Mumbai" పేరుతో డీడీ తీసుకోవాలి. అర్హత: పదవతరగతి పాసై ఉండాలి. అనుభవం: ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ ఏవియేషన్ సెక్టార్‌లో 5 ఏళ్ల అనుభవం తప్పనిసరి. వయసు: 33 ఏళ్ల లోపు ఉండాలి... వేతనం: రూ.15,418

Next Story

RELATED STORIES