బ్యాంకుల్లో 8,000కు పైగా ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు జులై 4

బ్యాంకుల్లో 8,000కు పైగా ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు జులై 4

బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 8వేలకు పైగా ఉద్యోగాలున్నాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నియామక ప్రక్రియ చేపట్టింది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 4 చివరి తేదీ. 45 రీజనల్ రూరల్ బ్యాంకు బ్రాంచ్‌లలో గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్), గ్రూప్ ఏ-ఆఫీసర్స్ (స్కేల్-II & III) పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ibps.in ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 18 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జులై 4.. ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: 2019 జులై 4.. ప్రిలిమినరీ పరీక్ష: 2019 ఆగస్ట్ 3,4,11 తేదీల్లో (ఆఫీసర్ స్కేల్ 1 ఉద్యోగాల కోసం), ఆగస్ట్ 17,18,25 (ఆఫీసర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం).. ఇక మెయిన్స్ పరీక్ష: 2019 సెప్టెంబర్ 22 (ఆపీసర్ స్కేల్ 1 వారికి), సెప్టెంబర్ 29 (ఆఫీస్ అసిస్టెంట్ వారికోసం)

Tags

Read MoreRead Less
Next Story