టీడీపీ నాయకులపై వైసీపీ నేతల హత్యాయత్నం

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. టీడీపీకి చెందిన మురళి, సుజన్, రాజుపై కత్తులతో ఎటాక్ చేసారు. విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు వైసీపీ వారిపై తిరగబడ్డారు. దీంతో.. వైసీపీ నాయకులకు కూడా గాయాలయ్యాయి.
వైసీపీకి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ ముద్దు రాయలు, ఆయన కుమారుడు కృష్ణకు తల పగిలింది. చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పాతకక్షలే ఈ దాడులకు కారణంగా చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాక తరచు రాజకీయ దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈమధ్యే కుప్పంలో రెండు రోజులు పర్యటించిన చంద్రబాబు.. తమ పార్టీ కేడర్ జోలికొస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. అయినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com