డిగ్రీ అర్హతతో ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు..

డిగ్రీ అర్హతతో ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ (APCOB-ఆప్కాబ్) మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

మొత్తం ఖాళీలు: 77.. స్టాఫ్ అసిస్టెంట్ : 54 (మహిళలకు 22 పోస్టులు).. మేనేజర్ (స్కేల్ 1): 23 (మహిళలకు 8 పోస్టులు)

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఏపీకి చెందిన వారై ఉండాలి. వయసు: 01.06.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ.590, మిగతావారు రూ.413 చెల్లించాలి. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.07.2019.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 28.07.2019.. రాత పరీక్ష: 25.08.2019

Tags

Read MoreRead Less
Next Story