Top

గ్రామ సచివాలయ ఉద్యోగాలు.. 91వేలకు పైగా పోస్టులు..

గ్రామ సచివాలయ ఉద్యోగాలు.. 91వేలకు పైగా పోస్టులు..
X

గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జులై 19న విడుదల చేసింది. 91,652 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. అయితే, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 14,098. గ్రామాల అభివృద్ధిపైన దృష్టి సారిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అదనంగా 77,554 కొత్త పోస్టుల్ని ఇవ్వబోతోంది. ఇక, ఇందుకు సంబంధించిన పరీక్ష ఆన్‌లైన్లో నిర్వహిస్తారు. అభ్యర్థుల ఎంపిక పరీక్షకు సంబంధించి ప్రత్యేక సిలబస్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇంటర్వ్యూలు ఉండవు. 150 మార్కుల పరీక్షలో.. 75 మార్కులు ఉద్యోగానికి సంబంధించినవి అయితే, మిగతా 75 జనరల్ నాలెడ్జికి సంబంధించినవి ఉంటాయి. 18 నుంచి 42 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. కాగా, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించే 150 మార్కుల పరీక్షలో 50 మార్కులు సిలబస్‌పై ఉంటాయి. మరో 50 జనరల్ నాలెడ్జ్‌పై, మిగతా 50 వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి వుంటాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 వేలు ఇవ్వనున్నట్లు సమాచారం. సెలక్ట్ అయిన అభ్యర్థులకు అప్పాయింట్ మెంట్ లెటర్స్ ఇస్తారు. ఆ తర్వాత వారికి బాపట్ల, సామర్లకోట, శ్రీకాళహస్తిలోని పంచాయితీ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ ఇస్తారు. అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.

Next Story

RELATED STORIES