సతీ లీలావతి.. భర్తకు విషం కలిపిన బిర్యానీ వడ్డించి..

మహిళ ఎందుకిలా మారిపోతుంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చాలనుకుంది. తమిళనాడు వేలూరు జిల్లా అత్తనవూరుకు చెందిన సెల్వం హోసూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య జయమతి, ఒక కూతురు ఉన్నారు. జయమతికి చదువుకునే రోజుల్లో ఓ అధ్యాపకుడితో పరిచయం ఏర్పడింది. వివాహమైన తరువాత కూడా అతడితో సంబంధాన్ని కొనసాగించింది భర్తకు తెలియకుండా. కొన్నాళ్లకు భర్తకు విషయం తెలిసి భార్యను నిలదీశాడు. అయినా ఆమె తన వ్యవహారాన్ని మార్చుకోలేదు.
గత నెల 17వ తేదీన కుమార్తె పుట్టినరోజని సెల్వం హోసూరు నుంచి ఇంటికి వచ్చాడు. అదేరోజు వివాహేతర సంబంధం గురించి భార్యా భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భర్తను కడతేర్చాలనుకుంది జయమతి. కమ్మగా బిర్యానీ వండి అందులో విషం కలిపి ప్రేమగా పతి దేవుడికి వడ్డించింది. పాపం అది తిన్న భర్త అక్కడే కుప్ప కూలిపోయాడు. సమయానికి వచ్చిన సెల్వం కుటుంబసభ్యులు హుటాహుటిన అతడిని కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హాస్పటల్‌లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com