తన బిడ్డ చావుకు కారణమైన కరెంట్‌ పోల్‌పై ఏనుగు ప్రతీకారం

తన బిడ్డ చావుకు కారణమైన కరెంట్‌ పోల్‌పై ఏనుగు ప్రతీకారం

కళ్ల ముందే బిడ్డ చనిపోతే ఆ తల్లి పడే బాధ మాటల్లో చెప్పలేం. జంతువులకైనా కళ్ల ముందు బిడ్డలు మరణిస్తే ఎమోషన్స్‌ మనలాగే ఉంటాయనిపిస్తోంది. ఓ తల్లి గజరాజం అలాంటి పరిస్థితే ఎదుర్కొంది. తన కళ్ల ఎదుటే విద్యుదాఘాతంలో పిల్ల ఏనుగు చనిపోయింది. అప్పటి వరకు పొలాల్లో తిరుగుతూ హాయిగా గడిపిన ఏనుగులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. జీవచ్ఛవమై పడిఉన్న పిల్ల ఏనుగు చుట్టూ చాలా సేపు తిరుగుతూ తన బాధను వెళ్లగక్కింది తల్లి ఏనుగు. చిత్తూరు జిల్లా పలమనేరులోని జి.కోటురులో ఈ ఘటన జరిగింది.

మనుషుల మాదిరిగా ఏనుగులు కూడా ప్రతీకారం తీర్చుకుంటాయా. ఈ ఘటనను చూస్తే నిజమే అనిపిస్తుంది. పిల్ల ఏనుగు చనిపోయాక కాసేపటికి జనాలు గుమిగూడారు. బిడ్డ మరణంపై బాధ, కోపం వస్తున్నా అప్పటికీ గ్రామస్థులు రావడంతో ఏమీ చేయలేక తల్లి ఏనుగు తన గుంపుతో కలిసి వెళ్లిపోయింది. ఈ రోజ తెల్లవారు జామున తల్లి ఏనుగు మళ్లీ సేమ్ స్పాట్‌లోకి ఎంటరైంది. తన బిడ్డ చావుకు కారణమైన కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తుపెట్టుకుని రివెంజ్‌ తీర్చుకుంది. కోపంతో తన ప్రతాపం చూపించింది. ట్రాన్స్‌ఫార్మర్‌ పోల్‌ను బలంగా నెట్టి కింద పడేసి తొక్కేసింది. తన కడుపుకోత బాధను తల్లి ఏనుగు అలా తీర్చుకుంది.

వివరాల్లోకి వెళితే... సుబ్రహ్మణ్యం అనే రైతు పొలంలో ప్రవేశించిన ఏనుగులు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ పోల్‌ తీగలు తీగలు సమయంలో ఏనుగు పిల్ల చనిపోయింది. ఆ తర్వాత తల్లి ఏనుగు బిడ్డ మరణానికి కారణమైన ట్రాన్స్‌పార్మర్‌ పోల్‌పై ప్రతీకారం తీర్చుకుంది.

Tags

Read MoreRead Less
Next Story