Top

చంద్రబాబు భద్రత కుదింపుపై హైకోర్టులో ముగిసిన వాదనలు

చంద్రబాబు భద్రత కుదింపుపై హైకోర్టులో ముగిసిన వాదనలు
X

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత కుదింపుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వాదనలు విన్న న్యాయ స్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది. వాదనల సందర్భంగా చంద్రబాబుకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువే సెక్యూరిటీ ఇస్తున్నామని హైకోర్టుకు తెలిపారు ఏపీ అడ్వకేట్ జనరల్. ఎక్కడెక్కడ ఎంతెంత ఏఏ స్థాయి అధికారులు భద్రత కల్పిస్తున్నారన్న వివరాలను కోర్టుకు సమర్పించారు. మొత్తం 74 మందితో భద్రత కల్పిస్తున్నామని.. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి కూడా భద్రత ఇస్తున్నామని కోర్టుకు వివరించారు ఏజీ. చంద్రబాబుకు మావోయిస్టులు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ప్రాణహానీ ఉందని.. అదనపు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.

Next Story

RELATED STORIES