వైసీపీలో వర్గపోరుకు కారణమవుతున్న గ్రామ వాలంటీర్ల ఎంపిక

వైసీపీలో వర్గపోరుకు కారణమవుతున్న గ్రామ వాలంటీర్ల ఎంపిక
X

గ్రామ వాలంటీర్లు పోస్టులు వైసీపీలో వర్గపోరుకు కారణమవుతున్నాయి. కడప జిల్లాలో గ్రామ వాలంటీర్ల పోస్టుల ప్రక్రియ ఆధిపత్య పోరుకు దారితీసింది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ఎదుట వైసీపీ కార్యకర్తలు ఇరు వర్గాలు విడిపోయి బాహాబాహికి దిగారు. కొల్లూరు కమలాపురం పీకే దిన్నె మండలాల్లోని గ్రామ వాలంటీర్ల పోస్టులకు తమ వారికి దక్కలేదంటూ నాయకులు, కార్యకర్తలు ఒకరిని ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేశారు. చిన్న ఘర్షన తరువాత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Tags

Next Story