శాంతించిన గోదావరి.. వరద తగ్గుముఖం

శాంతించిన గోదావరి.. వరద తగ్గుముఖం

ఎడతెరిపిలేని వర్షాలు.. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిన్నటి వరకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఊళ్లకు ఊళ్లను ముంచేసింది. అయితే ప్రస్తుతం వరుణుడు కాస్త విరామం తీసుకోవడంతో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం దగ్గర 12 లక్షల 74 వేల క్యూసెక్కుల ప్రవాహానికి చేరింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.

ధవళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం నీటి మట్టం 13.6 అడుగులు ఉంది. అయితే మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో.. సాయంత్రం తరువాత మరోసారి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 10 గంటల్లో ధవళేశ్వరం నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది.

ఇటు భద్రాచలం దగ్గర కూడా నీటిమట్టం నిలకడగా తగ్గుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర నీటి మట్టం 41.6 అడుగులు ఉంది. కూనవరం దగ్గర 18.32 అడుగులకు తగ్గింది. శబరి ప్రవాహం కూడా కాస్త తగ్గుముఖం పట్టింది.. చాలా నదుల్లో నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతుండడంతో ముంపు ప్రాంతాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు..

Tags

Read MoreRead Less
Next Story