దసరా అడ్వాన్స్.. పదివేలు తీస్కోండి.. పండగ చేస్కోండి

ఆహా! మేమెంత లక్కో మా బాసెంత మంచోరో. మూణ్ణెల్ల ముందుగానే పండగ అడ్వాన్స్ ప్రకటించారు. పండగ నెలరోజులు ఉందనగా పదివేలు చేతిలో పెడతారు. ఏమి హాయిలే హలా. ఈ పండగను మరింత ఆనందంగా జరుపుకోవచ్చని తమిళ తంబిలు సంతోషపడిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ రాకుండానే తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సీఎం పళనిస్వామి ఉద్యోగుల ఫెస్టివల్ అడ్వాన్స్‌కు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. 7వ వేతన సంఘం ప్రతిపాదనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల ఫెస్టివల్ అడ్వాన్స్ రూ.5వేల నుంచి రూ.10 వేలకు పెరిగింది. 2012లో రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు ఫెస్టివల్ అడ్వాన్స్ ఇచ్చింది. అప్పుడు రూ.5 వేలు ఇస్తే ఇప్పుడు దాన్ని డబుల్ చేసి పదివేలు ఇస్తోంది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్‌కు కూడా ఇది వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. 7వ పే కమిషన్ ప్రతిపాదనల అమలుతో ఉద్యోగుల జీతాలు కూడా 20 శాతం పెరిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com