సెప్టెంబర్ 15 నాటికి కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు

X
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో సిరిసిల్లలోని నేతన్నల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చేనేత, జౌళి శాఖ అధికారులతో బతుకమ్మ చీరలు, వస్త్ర పరిశ్రమపై ఆయన సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల ఒక తిర్పూర్ స్థాయికి చేరుకోవాలని, ఇక్కడి చీరలు బ్రాండ్ కావాలన్నారు కేటీఆర్. సెప్టెంబర్ 15 నాటికి తెలంగాణలోని కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. సిరిసిల్లలో 64 ఎకరాల్లో 175 కోట్లతో అపెరల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిరిసిల్లలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
