ఈసారి కలిస్తే పెళ్ళి చేసుకోమని చెప్తా!: ప్రభాస్‌

ఈసారి కలిస్తే పెళ్ళి చేసుకోమని చెప్తా!: ప్రభాస్‌
X

డార్లింగ్ ప్రభాస్ ఎక్కడికి వెళ్ళినా మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్న.. మీరు అనుష్కతో డేటింగ్‌లో ఉన్నారా? ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? అని. ఈ విషయంపై ఒక్క టాలీవుడ్‌ అభిమానులకే కాదు దేశంలోని అన్నీ చిత్ర పరిశ్రమల అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రూమర్లకు ప్రభాస్ చాలా సార్లు సమాధానం ఇచ్చారు. అనుష్క, తను కేవలం స్నేహితులమేనంటూ వంద సార్లు చెప్పుంటారు. అయినా కూడా వారి ఇద్దరిపై వస్తున్న రూమర్లకు తెర పడటం లేదు. ‘సాహో’ సినిమా ప్రచార కార్యక్రమంలో ఉన్న ప్రభాస్‌కు తాజాగా మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది. దాంతో ఆయనకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది.

ఈసారి ప్రభాస్ ఘాటుగానే స్పందించారు. "ఈ రూమర్లకు బ్రేక్ పడాలంటే నేనైనా, అనుష్కనైనా త్వరగా పెళ్ళి చేసుకోవాలి. ఈసారి అనుష్క కలిస్తే త్వరగా పెళ్లిచేసుకోమని చెబుతాను. అప్పుడైనా ఇలాంటి వదంతులు రాకుండా ఉంటాయి. ఒకవేళ మేము రిలేషన్‌షిప్‌లో ఉంటే ఆ విషయాన్ని దాచాల్సిన అవసరం ఏంటో నాకు ఇప్పటికీ అర్థంకావడంలేదు. నేను ఇన్ని చెబుతున్నామీరు నమ్మకపోతే నేనేం చేయలేను. ఇలాంటివి ఎక్కడినుంచి వస్తున్నాయో నాకు తెలియదు. నేను త్వరగా పెళ్ళి చేసుకోవాలని పరోక్షంగా ఇలా సూచిస్తున్నారేమో, అందుకే ఇలాంటి వార్తలను

ప్రచారం చేస్తున్నారని" అనుకుంటున్నానని ప్రభాస్ అన్నారు.

Tags

Next Story