ఏపీ సర్కార్‌ నిర్ణయంతో జనానికి కొత్త కష్టాలు

ఏపీ సర్కార్‌ నిర్ణయంతో జనానికి కొత్త కష్టాలు

రేషన్‌ కోసం EKYC చేయించాలన్న ఏపీ సర్కార్‌ నిర్ణయంతో జనానికి కొత్త కష్టాలు మెదలయ్యాయి. గంటల కొద్దీ క్యూలైన్లలో ప్రజలు నిలబడే పరిస్దితులు నెలకొన్నాయి. EKYC చేయకపొతే రేషన్ నిలిచిపోతుందనే భయంతో ప్రజలు వేకువజాము నుంచే బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అనేక ఇబ్బందులు పడుతూ క్యూలైన్లలో వేచి చూసినా తీరా తమ వంతు వచ్చే సరికి సర్వర్లు పనిచేయటం లేదని సాకులు చెబుతుండటంతో ఆధార్‌ బాధితులు తెల్లమెహం వేస్తున్నారు.

EKYC తప్పని సరి అంటూ నిభందనలు పెట్టడం , దానికి డెడ్ లైన్లు కూడా విధించారని ప్రచారం సాగటంతో EKYC నమెదు కేంద్రాలైన బ్యాంకులు , పోస్టాపీల వద్ద జనం బారులు తీరుతున్నారు. ప్రజా సాధికార సర్వేలో నమెదు కాని వారి కొసం EKYC చేపట్టడంతో ఈ సేవ కేంద్రాలతో పాటు బ్యాంకుల్లో సైతం రద్దీ పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 2 వేల 23 రేషన్ డిపోలు ఉండగా, EKYC నమోదు చేయించుకోవాల్సిన వారు 4 లక్షల 50 వేల మందికి పైగా ఉన్నారు. పిల్లలు మొదలు, పండు ముసలి వరకు గంటల తరబడి నమోదు కేంద్రాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నమోదు కేంద్రాల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. పిల్లలకు వేలి ముద్రలు పడకపోవడంతో వారందరినీ స్కూళ్లు మానిపించి నమెదు కేంద్రాలకు తీసుకొస్తున్నారు.

గతంలో.. పల్స్ సర్వేను రేషన్ దుకాణాలకు అనుంధానం చేయటం జరిగింది. దీంతో ప్రతి గ్రామంలోనూ ఆయా కేంధ్రాల వద్దకు ప్రజలు వెళ్లి నమెదు చేసుకున్నారు. తీరా ఇప్పుడు బ్యాంకులు , ప్రధాన పోస్ట్ ఆఫీసులు నమోదు కేంద్రాలుగా మారడంతో పనులు మానుకొని ప్రజలు పట్టణాలకు రావాల్సి వస్తోంది. ప్రజల వద్దకే సంక్షేమ పథకాలని, వాలంటీర్ల వ్యవస్థని చెప్పిన ప్రభుత్వం మాటలు ఆచరణలో కనిపించడంలేదు. బయెమెట్రిక్, పల్స్ సర్వే , EKYC అంటూ చెబుతున్న పదాలు ప్రజలకు ఓ పట్టాన అర్థం కావడం లేదు. ఆధార్ అనుసంధానం కోసం మీ సేవ, బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. గంటల కొద్దీ వేచి ఉన్నా పని జరగటం లేదని మండిపడుతున్నారు.

ప్రభుత్వం వెంటనే EKYC పై ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కొరుతున్నారు. రేషన్ కు అనుసంధానం చేసే ముందు గడువు తేదీని మరో సారి పోడిగించాని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులంతా ఆందోళన చెందకుండా ప్రభుత్వం EKYC గురించి ప్రజలకు తెలియజేయాలని వేడుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story