కరీంనగర్‌‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. ఆసక్తిగల అభ్యర్థులు..

కరీంనగర్‌‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. ఆసక్తిగల అభ్యర్థులు..

ఆర్మీలో ఉద్యోగం చేయాలని ఆసక్తి చూపించే అభ్యర్థులకు ఇది ఓ మంచి అవకాశం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 7 నుంచి 17వ తేదీ వరకు డా. బీర్ అంబేద్కర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ 23 నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థి ఏ రోజు ఏ టైమ్‌కి రావాలో అడ్మిట్ కార్డుపై రాసి ఉంటుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు వెరిఫికేషన్ పేపర్స్‌ని తీసుకెళ్లాలి.

పోస్టులు: సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ ఏవియేషన్ అండ్ అమ్యూనేషన్ ఎగ్జామినర్, నర్సింగ్, వెటర్నరీ అసిస్టెంట్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్. ఎంపిక విధానం: మెడికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక, వయసు: 17 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న యువకులు మాత్రమే అర్హులు. అభ్యర్థులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంకు రావల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డుతో పాటు అందులో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకురావాలి. షేవింగ్ చేసుకోకపోయినా, శరీరంపై పర్మినెంట్ టాటూలు ఉన్నా అనుమతించరు.

Tags

Read MoreRead Less
Next Story