ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కృష్ణా వరదల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. బాధితులను తక్షణమే ఆదుకోవాలన్నారు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో ప్రజలకు నష్టం చేయడానికి ప్రయత్నిస్తుందని.. బాధితులే పేర్కొంటున్నారన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాల్లో తాను పర్యటించానని స్పష్టం చేశారు. ఇక్కడ ఎన్నో సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. రాజధాని, తన నివాసం మునగాలనే దురుద్దేశంతో వరద ప్రవాహాలను అడ్డుకున్నారని చంద్రబాబు లేఖలో తెలిపారు. రైతులతో చెలగాటమాడారని ప్రజలే చెబుతున్నారన్నారు. ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా చేసిన విపత్తు ఇదని పేర్కొన్నారు. వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదికలు పంపాలన్నారు. రైతు రుణమాఫీ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com