Top

ఆ దందాలో వైసీపీ నేతలు ఉన్నారు కాబట్టే..

ఆ దందాలో వైసీపీ నేతలు ఉన్నారు కాబట్టే..
X

వైసీపీ నాయకుల జేబులు నింపడానికే ఏపీలో ఇసుక కొరత సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇసుక తవ్వడం దగ్గర నుంచి... దాన్ని తరలించడం.. నిల్వ చేయడం.. అమ్ముకోవడం.. అంతా అక్రమ మార్గంలోనే జరుగుతోందంటూ విమర్శించారు. వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని.. అందుకే అక్రమార్కులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

వైసీపీ నాయకులకు లబ్ది చేకూర్చేందుకే ఇసుక కొరత సృష్టించారని టీడీపీ తొలినుంచీ చెప్తూనే వస్తోందని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రభుత్వ అక్రమాల కారణంగా నిర్మాణ రంగ కార్మికులుగా పనిచేస్తున్న ఎంతోమంది కష్టజీవులకు పని లేకుండా పోయిందని విమర్శించారు. వైసీపీలోని వ్యక్తులను మేపడం కోసం.. బడుగు వర్గాలను పస్తులుంచడం దుర్మార్గమని చంద్రబాబు అన్నారు.

Next Story

RELATED STORIES