Top

హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంచారు.. ఆఖరు తేదీ..

హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంచారు.. ఆఖరు తేదీ..
X

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పది, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువు ముగిసిపోయింది. అయితే దరఖాస్తు గడువును మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి సెప్టెంబర్ 4తోనే దరఖాస్తు గడువు ముగిసింది. పాత గడువుని సవరిస్తూ మరో రెండు వారాలు అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టులు: 1,539.. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా.. వయసు: 01.07.2019 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.09.2019

Next Story

RELATED STORIES