హోటల్ బిల్లు రూ.180.. ఎక్కువైందని అడిగినందుకు ప్రాణాలు..

హోటల్ బిల్లు రూ.180.. ఎక్కువైందని అడిగినందుకు ప్రాణాలు..
X

కారణాలు చిన్నవే.. కానీ మనుషుల్ని చంపేంత కక్షలు. కోపం తారాస్థాయికి చేరుకుంటోంది. ఏం చేస్తున్నారో వారికి కూడా తెలియట్లేదు. అనంతర పరిణామాలు ఆలోచించట్లేదు. బిల్లు ఇంత వేశారేంటి అని హోటల్ యజమానిని అడిగినందుకు పాతికేళ్ల కుర్రాడిని దారుణంగా కొట్టి చంపేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భదోని జిల్లాకు చెందిన సురాజ్ సింగ్, విశాల్ దూబే అనే ఇద్దరు యువకులు మహరాజ్‌గంజ్ సమీపంలోని సర్దార్ దాబాకి భోజనానికని వెళ్లారు. తినడం పూర్తయిన తరువాత రూ.180ల బిల్లు చేతిలో పెట్టారు హోటల్ సిబ్బంది. అది చూసి బిల్లు ఎక్కువ వేశారంటూ హోటల్ యజమాని గుర్మైల్ సింగ్, సురేంద్ర సింగ్‌లతో వాగ్వాదానికి దిగారు ఈ ఇద్దరు యువకులు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో హోటల్ యజమాని, అతని కుమారుడు, సిబ్బంది కలిసి కర్రలు, రాడ్లతో సురాజ్ సింగ్, విశాల్ దూబేలను తీవ్రంగా కొట్టారు. దూబే వారి దెబ్బలకు తాళలేక తప్పించుకు పారిపోయాడు.. పాపం సురాజ్ దొరికి పోయాడు.. దాంతో వారి చేతిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హోటల్ యజమానిని అరెస్టు చేశారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story

RELATED STORIES