గణేష్ నిమజ్జనాన్నిచూస్తున్నటీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడి

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో నిన్న అర్థరాత్రి టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. వైసీపీ వర్గానికి చెందినవారు రాత్రి గణేష్ నిమజ్జనానికి బయలుదేరారు. అదే సమయంలో ఆ ఉత్సవాన్ని చూసేందుకు టీడీపీ వర్గీయులు వాళ్ల ఇంటి ముందు నిలబడి ఉన్నారు. గణేష్ యాత్ర అక్కడికి చేరగానే వైసీపీకు చెందిన కొందరు టీడీపీ కార్యకర్తల ఇళ్లపై రాళ్లు రువ్వారు. కొందరు ఆకతాయిలు మందు బాటిళ్లు కూడా ఇళ్లపై విసిరారు. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. తమపై దాడులు జరుగుతున్నాయని కంప్లయింట్ చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు బాధితులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com