ఏపీలో పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి : టీడీపీ

ఏపీలో పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి : టీడీపీ

వైసీపీ సర్కార్‌ వైఫల్యాలపై మరింత దూకుడు పెంచింది టీడీపీ. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. ఈ వంద రోజుల పాలనలో వైసీపీ ప్రభుత్వం సాధించిందేమీ లేదని మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. వైసీపీ ప్రభుత్వ వంద రోజుల పాలనపై గుంటూరులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు.

ఏపీ భవిష్యత్‌ను వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీ సర్కార్ నిర్వాకంతో ఏపీ ప్రగతి దెబ్బతిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీది నెగటివ్‌ రోలే అని అన్నారు.

వైసీపీ 100 రోజుల పాలన తుగ్లక్‌ పాలనను తలపించిందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. 3 వందల తప్పులు, ఆరు వందల రద్దులు అన్న విధంగా వైసీపీ పాలన ఉందని ఆయన విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వ తీరుతో పెట్టుబడులు వెనక్కిపోతున్నాయని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గత వంద రోజుల్లో ఆర్థిక ప్రగతి కుంటు పడిందని.. ఏపీ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story