హైకోర్టులో ఉద్యోగాలకు అప్లై చేశారా.. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 18

హైకోర్టులో ఉద్యోగాలకు అప్లై చేశారా.. లాస్ట్ డేట్ సెప్టెంబర్ 18

పది లేదా ఇంటర్ పాసై ఉంటే తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 1539 పోస్టుల భర్తీకి గానూ తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మధ్యలో దరఖాస్తు గడువు కూడా పెంచింది. పెంచిన గడువు ప్రకారం సెప్టెంబర్ 18 చివరి తేదీ. రికార్డ్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్ధులు www.hc.ts.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

మొత్తం పోస్టులు : 1539.. ఆఫీస్ సబార్టినేట్: 686, జూనియర్ అసిస్టెంట్: 277, టైపిస్ట్: 146, కాపీయిస్ట్:122, ప్రాసెస్ సర్వర్: 127, ఫీల్డ్ అసిస్టెంట్: 65, స్టెనో‌గ్రాఫర్ గ్రేడ్-3: 54, ఎగ్జామినర్: 57, రికార్డ్ అసిస్టెంట్: 05. విద్యార్హత: కాపీయిస్ట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ప్రాసెస్ సర్వర్ పోస్టుకు 10వ తరగతి పాసైతే చాలు. వయసు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.

Tags

Read MoreRead Less
Next Story