ప్రియుడిని కొట్టి.. ప్రియురాలిపై సామూహిక అత్యాచారం

ప్రియుడిని కొట్టి.. ప్రియురాలిపై సామూహిక అత్యాచారం
X

అటవీ ప్రాంతంలో ఏకాంతంగా ఉన్న ఓ జంటపై కొందరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం మహిళను పొదల్లోకి తీసుకెళ్ళి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తమిళనాడులోని వాళప్పాడి సమీపంలో ఉన్న మెయ్యమలై అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. సేలం జిల్లా మన్‌నాయకన్‌ పట్టికి చెందిన 32 ఏళ్ల వివాహితకు తను పని చేస్తున్న

కంపెనీలో 25 ఏళ్ళ దినేష్‌ అనే వ్యక్తితోో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వారు తరుచూ ఒంటరిగా కలుస్తూ ఏకాంతంగా గడిపేవారు ఈ క్రమంలో సోమవారం ఇద్దరూ బైక్‌పై మెయ్యమలై అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.

బైక్‌ను దారి పక్కన వదిలి దట్టమైన ఆటవి ప్రాంతంలోకి వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఆరుగురు వ్యక్తులు వారిని అడ్డగించి తీవ్రంగా కొట్టారు. అనంతరం మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్నడ్డారు. త్రీవంగా గాయపడ్డ దినేష్ సమీఫ గ్రామంలోకి వెళ్ళి కొందరిని తీసుకురాగ అప్పటికే అక్కడి నుంచి వారు పరారయ్యారు. ఈ సంఘటనపై బాధిత మహిళ ఏత్తాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతులను పట్టుకుని విచారిస్తున్నారు.

Next Story

RELATED STORIES