ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 8000 టీచర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఒక్కరోజే గడువు

ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 8000 టీచర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఒక్కరోజే గడువు

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8000కు పైగా ఉన్న పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దేశంలోని మిలిటరీ స్టేషన్స్, కంటోన్మెంట్లలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఈ పోస్టుల్ని నియమించనుంది. అయితే ఏఏ స్కూళ్లలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇంటర్వ్యూ నిర్వహించే ముందు ఆయా స్కూల్స్ వెల్లడిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 21. కంబైన్ట్ సెలెక్షన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీచేయనుంది ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్

స్కిల్స్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు www.awesindia.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 1

దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 21

పరీక్ష నిర్వహించే తేదీ: 2019 అక్టోబర్ 19, 20

ఫలితాల విడుదల: 2019 అక్టోబర్ 30

విద్యార్హతలు, ఇతర వివరాలు

PGT: పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులతో పాసవడంతో పాటు బీఈడీ ఉండాలి.

TGT: గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులతో పాసవడంతో పాటు బీఈడీ ఉండాలి.

PRT:బీఈడీతో పాటు రెండేళ్ల డిప్లొమా 50% మార్కులతో పాస్ కావాలి.

వయసు: ఫ్రెషర్స్‌కు 40 ఏళ్లు, ఎక్స్‌‌పీరియన్స్ ఉన్న వారికి 57 ఏళ్లు.

Tags

Read MoreRead Less
Next Story