అంత రేటయినా ఎంత మంది లైన్లో ఉన్నారో..

అంత రేటయినా ఎంత మంది లైన్లో ఉన్నారో..
X

ఇటలీకి చెందిన కార్ల తయారీ సంస్ధ లంబోర్గిని భారత మార్కెట్లోకి 'ఉరుస్' అనే ఓ సరికొత్త కారుని ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కారు ధర దాదాపు రూ. 3 కోట్లు ఉన్నా ఇప్పటికే 50కి పైగా బుకింగ్స్‌ వచ్చాయి కంపెనీకి. అంటే సగటున వారానికి ఒక కారు చొప్పున విక్రయం జరుగుతోందని లంబోర్గిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. ఏడాది చివరి నాటికి 65 యూనిట్లను విక్రయించే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. అదే జరిగితే భారత మార్కెట్లో లగ్జరీ కార్ల విక్రయం జరిగిన తొలి సంస్థగా లంబోర్గీ రికార్డులకెక్కనుంది. ఇదే కారు గత ఏడాది 45 వాహనాలను విక్రయించింది. ఈ సంవత్సరం ఆ లక్ష్యాన్ని మరి కొంత అధిగమించింది. వచ్చే ఏడాది కల్లా సరాసరి ఏడాదికి 100 వాహనాలకు అమ్మాలని, ఆమేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు.

Next Story

RELATED STORIES