ప్రియుడి డైరక్షన్‌లో తల్లిని హతమార్చిన కీర్తి

హయత్ నగర్ మర్డర్ కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తల్లిని చంపిన కీర్తితో పాటు.. సహ నిందితులు శశి, బాల్‌రెడ్డిని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు తరలించారు. అత్యంత కిరాతకంగా తల్లినే హత్య చేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లి రజితను చంపేలా కీర్తీని.. ఆమె ప్రియుడు శశియే ప్రోత్సహించాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న రజితను చంపితే పెళ్లి చేసుకోవచ్చని ఆమెను రెచ్చగొట్టినట్టు తెలిసింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఇద్దరూ కలిసి రజితను దారుణంగా చంపినట్టు విచారణలో తేలింది.
తల్లి గుండెలపై కూర్చొని...చున్నీని మెడ చుట్టూ గట్టిగా బిగించింది కీర్తి. తల్లి కాళ్లు, చేతులు కదలకుండా శశి పట్టుకున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా ప్రియుడు శశి డైరక్షన్‌లోనే సాగిందని.. చెడు తిరుగుళ్లు వద్దని రజిత మందలించినందుకు ఇంత దారుణానికి కీర్తి ఒడిగట్టిందని తెలస్తుంది. అమ్మను చంపిన తర్వాత.. ప్రియుడు శశితో కలిసి అదే గదిలో 3 రోజులు సహజీవనం చేసింది. ఇంట్లో దుర్వాసన ఎక్కువవడంతో.. అప్పుడు కార్లో తల్లి శవాన్ని తీసుకెళ్లి.. తుమ్మలగూడెం వద్ద రైలు పట్టాలపై పడేసింది.. మళ్లీ ఏం తెలియదన్నట్లు తండ్రిపైనే రివర్స్ కేసు పెట్టింది.
శ్రీనివాస్ రెడ్డి, రజితలకు ఒక్కగానొక్క కూతురు కీర్తి. దీంతో ఆమె ఆస్తిపై కన్నేశాడు శశి. కీర్తిని పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కుతుందని భావించాడు. అయితే రజిత వీరి ప్రేమ వ్యవహారం తెలిసి... మందలించింది. పలుమార్లు ఇద్దరికీ వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో రజితపై కక్ష పెంచుకున్న శశి.. ఆమెను ఎలాగైనా అంతమొందించాలని భావించాడు. ఆమె బతికుండగా పెళ్లి చేసుకోవడం కుదరదనే నిర్ణయానికి వచ్చాడు. ఇందులో భాగంగానే కీర్తిని రెచ్చగొట్టి తల్లిని చంపేలా ప్లానేశాడు. పథకం ప్రకారం కీర్తిని రెచ్చగొట్టాడు. మీ అమ్మ ఉండగా మన పెళ్లి జరగదని.. ఆమెను చంపేద్దామని సలహా ఇచ్చాడు. కీర్తి కూడా శశి మయాలో పడింది. చివరకు ఇద్దరు కలిసి రజితను హతమార్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com