తాజా వార్తలు

ఆగిన మరో ఆర్టీసీ కార్మికుని గుండె

ఆగిన మరో ఆర్టీసీ కార్మికుని గుండె
X

ts-rtc

నల్గొండ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ తుమ్మలపల్లి జైపాల్‌ రెడ్డికి ఆర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూశాడు. నాపంల్లి మండలం పగిడిపల్లికి చెందిన జైపాల్‌ రెడ్డి ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆదివారం నిరాహార దీక్షలో కూడా పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు అర్థరాత్రి గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో దేవరకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జైపాల్‌రెడ్డి మృతికి నిరసనగా డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీల నేతలు ధర్నా నిర్వహించారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో డ్రైవర్‌ జైపాల్‌రెడ్డి గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇన్ని రోజులైనా సమ్మె కొలిక్కి రావపోవడంతో జైపాల్‌రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురైనట్టు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఆ ఒత్తిడిలోనే ఆర్థరాత్రి గుండెపోటుకు గురయ్యారని అంటున్నారు. మరో ఆర్టీసీ కార్మికుడి మృతితో జేఏసీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES