విజయారెడ్డి హత్యకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసిన సురేష్ భార్య లత

X
TV5 Telugu8 Nov 2019 10:26 AM GMT
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో సురేష్ భార్య లత.. సంచలన అంశాలు వెల్లడించింది. చనిపోవడానికి ముందు ఆస్పత్రిలో.. భార్యతో మాట్లాడిన సురేష్ పలు కీలక అంశాలు చెప్పినట్టు తెలుస్తోంది. తన భర్త తహసీల్దార్‌పై దాడి చేయాలనే ఉద్దేశంతో వెళ్లలేదని.. ఆత్మహత్యాయ్నం చేసి భయపెట్టాలనుకున్నాడని తెలిపింది. అయినా.. విజయారెడ్డి వినకపోవడంతో ఆమెనూ చంపాలనుకున్నాడని వెల్లడించింది. తన భర్త లాంటి చావు మరే రైతుకు రాకూడదని ఆవేదన వ్యక్తం చేసింది. భూముల వ్యవహారంలో సురేష్ లక్ష రూపాయలు అప్పుచేశాడని అవి ఎవరికి ఇచ్చాడో తెలియదని లత చెబుతోంది.
Next Story