టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక అంశాలపై చర్చ

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక అంశాలపై చర్చ

ktr

TRS పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈనెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వొద్దంటూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన అంశమూ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్లమెంటరీ పక్షనేత కే.కేశవరావు అధ్యక్షత వహిస్తున్నారు..

పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కేసీఆర్‌ అధ్యక్షత వహించారు. కానీ తొలిసారిగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, సంక్షేమ పథకాల కోసం ఈ సారి కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్ధేశం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story