ఇంటర్, డిగ్రీ అర్హతతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు..

ఇంటర్, డిగ్రీ అర్హతతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు..

nift

ఫ్యాషన్ రంగంపై అభిరుచి, ఆసక్తి ఉన్న విద్యార్థులు సృజనాత్మకతను నిరూపించుకోవాలనుకునేవారు ఫ్యాషన్ డిజైనింగ్/ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల ద్వారా తమ కెరీర్‌ను మలుచుకోవచ్చు. డిప్లొమా, డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్ అర్హత. డిప్లొమా కాలవ్యవధి ఏడాది. డిగ్రీ మూడు నుంచి నాలుగేళ్లు. పీజీ రెండు సంవత్సరాలు. చాలా కోర్సులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని కోర్సులు చేయాలంటే మాత్రం సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. మరికొన్ని సంస్థలు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఫ్యాషన్ కోర్సులను అందిస్తున్న ప్రముఖ సంస్థలు..

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (దేశవ్యాప్తంగా 16 క్యాంపస్‌లు)

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్.. సింబయాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన, పుణే.. ఓగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బెంగళూరు.. సీఈటీ కాలేజ్ ఆఫ్ మేనేజ్‌మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐరాపురం (కేరళ), మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కొట్టాయం.. అమిటీ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నోయిడా, ఉత్తరప్రదేశ్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.. ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా .. ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 23.10.2019, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 31.12.2019, రాత పరీక్ష: 19.01.2020.

Read MoreRead Less
Next Story