ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. జీతం: రూ.69,100.. అప్లైకి ఆఖరు నవంబర్ 18

ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. జీతం: రూ.69,100.. అప్లైకి ఆఖరు నవంబర్ 18

indian-navy

భారత నౌకాదళం భారీ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇండియన్ నేవీ ఏఏ (సెయిలర్ ఆర్టిపిషర్ అప్రెంటిస్), ఎస్ఎస్ఆర్ (సెయిలర్ సీనియర్ సెకండరీ) ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 2700 ఖాళీలున్నాయి. ఇంటర్ పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు joinindiannavy.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 8 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 18 ఆఖరు తేదీ. ఇండియన్ నేవీ ప్రకటించిన మొత్తం 2700 ఖాళీల్లో సెయిలర్ (సీనియర్) పోస్టులు 2200, సెయిలర్ (ఆర్టిఫిషర్ అప్రెంటీస్) పోస్టులు 500. ఎంపికైన వారికి స్టైఫండ్ నెలకు రూ.14,600 లభిస్తుంది. శిక్షణ పూర్తైన తరువాత వేతనం రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య ఉంటుంది. సెయిలర్ సీనియర్ సెకండరీ పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ, కంప్యూటర్, బయాలజీ సబ్జెక్ట్‌తో 12వ తరగతి పాసై ఉండాలి. ఆర్టిఫిషర్ అప్రెంటీస్ పోస్టుకు మ్యాథ్స్, ఫిజిక్స్‌తో 12వ తరగతి 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. పెళ్లి కాని వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

Read MoreRead Less
Next Story