40 వేల మంది ఐటీ ఉద్యోగులకు ఎసరు..

40 వేల మంది ఐటీ ఉద్యోగులకు ఎసరు..

IT-employees

చేస్తున్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో అన్న టెన్షన్‌తోనే రోజూ ఆఫీస్‌కి.. అన్ని కంపెనీల్లో దాదాపు పరిస్థితి ఇలాగే ఉన్నా ఇది ఐటీ కంపెనీల్లో మరీ ఎక్కువ. వ్యాపారంలో వృద్ధి మందగించడమే కారణంగా చెబుతూ 30 నుంచి 40 వేల మంది మధ్య స్థాయి ఉద్యోగులను తొలగించే పనిలో పడింది ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్. అయిదేళ్లకోసారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుందని ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) పాయ్ అన్నారు. ఏదైనా పరిశ్రమ ఓ స్థాయికి వెళ్లాక మద్య స్థాయిలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉండిపోతారు. కంపెనీ లాభాలు ఆర్జిస్తూ వారికి ప్రమోషన్లు ఇవ్వగలిగే స్థాయిలో ఉంటే సరి. లేదంటే కంపెనీ ఆర్థికంగా లాభాల్లో లేనప్పుడు వేతనాలు అధికంగా పొందే వారిపై వేటు పడుతుంది. అప్పుడు తొలగింపులు సహజమన్నారు. సరైన పనితీరును ప్రదర్శిస్తే భారీ వేతనాలు పొందడానికి అర్హులని ఆయన అంటున్నారు. మొత్తం మీద 30 నుంచి 40 వేల మంది మీద వేటు పడబోతోందని పాయ్ పేర్కొన్నారు.

Read MoreRead Less
Next Story