టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేకు భారత పౌరసత్వం రద్దు చేసి కేంద్ర హోం శాఖ

టీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యేకు భారత పౌరసత్వం రద్దు చేసి కేంద్ర హోం శాఖ

ramesh

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు కేంద్ర హోంశాఖ పెద్ద షాకిచ్చింది. ఆయన భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నమనేని రమేష్‌ 1993 లో జర్మనీకి వలస వెళ్లారు. జర్మనీ పౌరసత్వాన్ని స్వీకరించారు. ఆ తర్వాత 2009లో భారత్‌కు తిరిగి వచ్చారు. మళ్లీ భారత పౌరసత్వాన్ని స్వీకరించారు. మూడు సార్లు టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన చెన్నమనేని రమేష్ పౌరసత్వం మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆది శ్రీనివాస్ అనే ఆయన.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ వివాదం కేంద్ర హోంశాఖ వద్దకు చేరింది.

గతంలో దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పౌరసత్వంపై కేంద్ర హోంశాఖ మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా దీనిపై విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే అభిప్రాయం చెప్పింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కేంద్ర హోంశాఖ అన్ని వివరాలు పరిశీలించింది. పిటిషనర్‌తో పాటు, చెన్నమనేని రమేశ్ నుంచి కూడా వివరాలు సేకరించిన తరువాత భారత పౌరసత్వ విభాగం కీలక ఆదేశాలు జారీ చేస్తూ.. ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది.

చెన్నమనేని రమేష్‌ భారత పౌరుడు కాదని.. ఎలాంటి అధికారాలు పొందేందుకు అర్హుడు కాదని హోంశాఖ స్పష్టం చేసింది. చట్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని.. ఈ దేశంలో పర్యటించాలంటే వీసా తీసుకోవాల్సిందేనని పేర్కొంది. అమెరికా నుంచి గతంలో ఆయన వీసా పొందే సమయంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని.. భారత్‌కు వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు అమెరికా వెళ్లకుండా వీసాను పునరుద్ధరించుకోకుండా వ్యవహరించారని పేర్కొంది. తప్పుడు సమాచారంతో భారత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం రమేశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎలాంటి పదవులు పొందడానికి ఆస్కారం లేకుండా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హోం శాఖ నిర్ణయంపై స్పందించిన ఆయన హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story