పదవతరగతి అర్హతతో నావల్ షిప్ యార్డ్‌లో ఉద్యోగాలు..

పదవతరగతి అర్హతతో నావల్ షిప్ యార్డ్‌లో ఉద్యోగాలు..

ship-yard

ఇండియన్ నేవీకి చెందిన నావల్ షిప్ యార్డ్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. కర్నాటకలోని కార్వార్‌లో గల నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో మొత్తం 145 అప్రెంటీస్ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 1 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు https://apprenticeship.gov.in వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 145

షిప్‌రైట్ (వుడ్) : 6.. ఎలక్ట్రీషియన్: 12.. ఎలక్ట్రానిక్ మెకానిక్: 15.. ఫిట్టర్: 4.. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటనెన్స్: 4.. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్: 4.. మెషినిస్ట్: 2.. మెరైన్ ఇంజిన్ ఫిట్టర్: 6.. బిల్డింగ్ మెయింటనెన్స్ టెక్నీషియన్: 3.. మెకానిక్ డీజిల్: 11.. మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్: 3.. మెకానిక్ మోటార్ వెహికల్: 12.. మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ: 10.. పెయింటర్ (జనరల్):4.. పైప్ ఫిట్టర్: 10.. టైలర్ (జనరల్): 3, టర్నర్: 3.. షీట్ మెటల్ వర్కర్: 6.. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్): 12.. రిగ్గర్: 5.. షిప్‌రైట్ స్టీల్: 10.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 అక్టోబర్ 22.. దరఖాస్తుకు చివరి తేదీ 2019 డిసెంబర్ 1.. విద్యార్హత: 50% మార్కులతో 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. వయసు: 14 నుంచి 21 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

Read MoreRead Less
Next Story