ఇంటర్, డిగ్రీ అర్హతతో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు ఈనెల 26

ఇంటర్, డిగ్రీ అర్హతతో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు ఈనెల 26

samagra-siksha

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌లో మొత్తం 704 ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, సిస్టమ్ ఎనలిస్ట్ వంటి పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువు ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం నవంబర్ 23. తాజాగా గడువును నవంబర్ 26కు పొడిగించారు. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ, బీటెక్ అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.

ఖాళీల వివరాలు..

ఎంఐఎస్ కోఆర్డినేటర్: 144.. సిస్టమ్ అనలిస్ట్: 12.. అసిస్టెంట్ ప్రోగ్రామర్: 27.. ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్: 383.. డేటా ఎంట్రీ ఆపరేటర్: 138

ఎంఐఎస్ కోఆర్డినేటర్-బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) లేదా బీఎస్సీ (ఎంపీసీ) పాస్ కావడంతో పాటు పీజీడీసీఏ సర్టిఫికెట్ ఉండాలి. లేదా బీసీఏతో పాటు ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలి.

డేటా ఎంట్రీ ఆపరేటర్-ఏదైనా డిగ్రీతో పాటు డీసీఏ, ఎంఎస్ ఆఫీస్

సిస్టమ్ అనలిస్ట్: బీకామ్/ఎంకామ్/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హతతోపాటు ట్యాలీ 9 ఈఆర్‌పీ అకౌంటింగ్ ప్యాకేజీ తెలిసుండాలి.

అసిస్టెంట్ ప్రోగ్రామర్-ఎంసీఏ లేదా బీటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎంఎస్సీ (కంప్యూటర్స్) పాస్ కావడంతో పాటు ఒరాకిల్ తెలిసుండాలి.

ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ పర్సన్- ఇంటర్మీడియట్‌తో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా లేదా డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 నవంబర్ 20.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 నవంబర్ 26.. ఆన్‌లైన్ పరీక్ష: 2019 డిసెంబర్ 2వ వారం

వయసు: 2019 జులై 1 నాటికి 34 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు: రూ.600

Read MoreRead Less
Next Story