పోలీసుల నిర్లక్ష్యం వలనే ప్రియాంక చనిపోయింది: తల్లిదండ్రులు

పోలీసుల నిర్లక్ష్యం వలనే ప్రియాంక చనిపోయింది: తల్లిదండ్రులు

priyankareddy

డాక్టర్‌ ప్రియాంక రెడ్డి హత్యకేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్‌కు చెందిన మహ్మద్ పాషాను శంషాబాద్ పోలీసులు సూత్రధారిగా గుర్తించారు. లారీ డ్రైవర్, క్లీనర్‌తోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ అరెస్టు చేశారు. ప్రియాంక గొంతు నులిమి చంపినట్టు పోస్ట్‌మార్టంలో తేలింది. ప్రియాంక మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి.. కిరోసిన్‌ పోసి కిరాతకులు కాల్చేశారు. శంషాబాద్ టోల్‌గేట్ దగ్గరే ప్రియాంకను హత్య చేసినట్లు గుర్తించారు. అటు.. ప్రియాంక హత్య కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తానంటూ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది అత్యంత హేయమైన చర్య అని.. ఆ మానవ మృగాలకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

తమ కూతురిని దారుణంగా హత్యచేసిన నిందితులను బహిరంగంగా ఎన్‌కౌంటర్‌ చేయాలంటున్నారు ప్రియాంక రెడ్డి పేరెంట్స్ విజయ, శ్రీధర్‌ రెడ్డి. పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే తమ కూతురు దారుణహత్యకు గురైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేశాక ఘటన జరిగిన ప్రదేశంలో తమది కాదంటే తమదికాదని.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంటున్నారు. ప్రియాంకకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దని కోరుతున్నారు. నిందితులను పెట్రోల్‌ పోసి తగలబెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story