డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో పురోగతి.. ఇద్దరు అరెస్ట్

డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో పురోగతి.. ఇద్దరు అరెస్ట్

priyankareddy

సంచలనం సృష్టించిన డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక ఆధారాలతో అనంతపురానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించడం లేదు. గురువారం మధ్యాహ్నం నుంచి సీపీ సజ్జనార్ శంషాబాద్ డీసీపీ కార్యాలయంలోనే ఉండి ఈ హత్యకేసును పర్యవేక్షిస్తున్నారు. అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్‌, క్లీనర్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రియాంక స్కూటీని కొత్తూరు దగ్గర గుర్తించారు. నంబర్ ప్లేట్ తీసేసిన దుండగులు లారీలో స్కూటీని అక్కడి వరకు తరలించి వదిలివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రియాంకకు చెందిన దుస్తులు, వస్తువులతోపాటు ఓ మద్యం సీసాను టోల్‌గేట్ సమీపంలోని కాంపౌండ్‌లో పోలీసులు గుర్తించారు.

హత్యకు గురవ్వక ముందు ప్రియాంకరెడ్డి ఇంటికి ఫోన్ చేసి చెల్లెలితో మాట్లాడింది. అక్కడి పరిస్థితిని క్లియర్‌గా వివరించింది. ఇక్కడ చాలా మంది ఉన్నారని.. వారిని చూస్తుంటే భయమేస్తోందని చెప్పింది. స్కూటీని తీసుకెళ్లారని.. వాళ్లు వచ్చేవరకు తనతో మాట్లాడాలంటూ చెల్లిని బతిమిలాడింది. బండి వదిలేసి పక్కనే ఉన్న టోల్‌గేట్ దగ్గరకు రావాలని సలహా ఇచ్చింది చెల్లెలు. మళ్లీ రేపు బండి తీసుకోవడం ఇబ్బంది అవుతుందంటూ అక్కడే ఉండిపోయింది ప్రియాంక రెడ్డి. అంతే అక్కడితో కాల్ కట్‌ అయిపోయింది.

ప్రియాంక రెడ్డి హత్య ఘటనను నిరసిస్తూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శంషాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు.

Tags

Read MoreRead Less
Next Story