తాజా వార్తలు

పెట్టుబడుల విషయంలో కేంద్రం రాజకీయం చేస్తుంది: కేటీఆర్

పెట్టుబడుల విషయంలో కేంద్రం రాజకీయం చేస్తుంది: కేటీఆర్
X

ktr

డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్ చాలా అనువైన ప్రాంతమన్నారు మంత్రి KTR. కానీ కేంద్రం నాగ్‌పూర్‌, గుజరాత్, చెన్నైలను మాత్రమే పట్టించుకుంటోందని ఆరోపించారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై కేంద్రంతో మాట్లాడినా.. అది చెన్నైకి వెళ్లిపోయిందన్నారు. హైదరాబాద్‌లో CII ఆధ్వర్యంలో నిర్వహించిన కాంక్లేవ్‌లో మాట్లాడిన KTR.. కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండడం మంచి పరిణామం కాదన్నారు. ఈ ఐదేళ్లలో నలుగురు రక్షణ మంత్రుల్ని కలిసి.. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌పై మాట్లాడామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏరోస్పేస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.

Next Story

RELATED STORIES