ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. జీతం రూ. 56,000

ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు.. జీతం రూ. 56,000

lic

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ LIC HFL అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లీగల్ విభాగంలో ఈ పోస్టులు ఉన్నాయి. మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఎంపికైన తరువాత ఏడిది ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 16 చివరి తేదీ. https://www.lichousing.com/ వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) మొత్తం ఖాళీలు: 35.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 డిసెంబర్ 2.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 డిసెంబర్ 16.. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్: 2020 జనవరి 27.. విద్యార్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ (LLB) 55 శాతం మార్కులతో పాస్ కావాలి. కంప్యూటర్ స్కిల్స్ తెలిసి ఉండాలి. వయసు: 2019 జనవరి 1 నాటికి 23 నుంచి 30 ఏళ్లు. వేతనం : రూ. రూ.56,000.

Read MoreRead Less
Next Story