కోహ్లీసేన పరుగుల సునామీ.. భారత్ బౌలింగ్‌కి విండీస్ విలవిల..

కోహ్లీసేన పరుగుల సునామీ.. భారత్ బౌలింగ్‌కి విండీస్ విలవిల..

cricket

ముంబై వాంఖడే స్టేడియంలో వెస్టిండిస్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో కరేబియన్‌ జట్టును మట్టికరిపించింది కోహ్లీసేన. ఈ విక్టరితో మూడు మ్యాచ్‌ల టీ 20 సీరిస్‌ను 2-1 తేడాతో టీమిండియా గెలిచింది.

241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన విండీస్‌ జట్టు.. 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి కేవలం 173 పరుగులు మాత్రమే చేసింది. టార్గెట్‌ చేధనలో తడబడిన వెస్టిండీస్‌ జట్టు.. ప్రారంభం నుంచి వరుస వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ పొలార్డు 68 పరుగులు చేయగా, హెట్‌ మెయిర్‌ 41 పరుగులతో పోరాడినప్పటికీ.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు.

వెస్టిండిస్‌ బ్యాట్స్‌మెన్ పోలార్డ్‌, హెట్‌మెయిర్‌ తప్ప.. ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ సాధించలేకపోయారు. సిమన్స్, కింగ్, పూరన్‌, హోల్డర్‌, పియర్లు కేవలం సింగిల్‌ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్‌, షమి, దీపక్‌ చాపర్‌, కుల్దీప్‌ తలో రెండు వికెట్లు తీశారు.

అంతకు ముందు.. బ్యాంటింగ్‌ చేసిన కోహ్లీసేన.. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ, కేఎల్‌ రాహుల్‌, కెప్టెన్‌ కోహ్లీ మెరుపులు మెరిపించారు. వేగంగా ఆడుతూ స్కోర్‌ను పరుగులు పెట్టించారు. రోహిత్‌ 71, కేఎల్‌ రాహుల్‌ 91 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ వస్తూనే విండీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో విండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి సత్తా చాటాడు.

ఇక టీ20లో భారత్‌కు ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై 260 పరుగులు చేసింది టీమిండియా. 2016లో లాడర్‌ హిల్‌లో వెస్టిండీస్‌పై 244 రన్స్‌ చేసింది. ఇక ఈ ఏడాది మార్చిలో 240 పరుగులు చేసి మరోసారి విండీస్‌పై భారీ స్కోరు సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story