టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు, మోసాలతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది: కాంగ్రెస్

టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు, మోసాలతో ఏడాది పాలన పూర్తి చేసుకుంది: కాంగ్రెస్

cm-kcr

గులాబీ బాస్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సర్కార్ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల హామీలను ఏకరువు పెడుతూ విమర్శలను ఎక్కుపెట్టారు. రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌ ను నమ్మి రెండోసారి అధికారం అప్పగించినా.. కేసీఆర్ తన తియ్యటి మాటలతో ప్రజల నోళ్లు తీపిచేస్తున్నాడే తప్పా.. జనం కడుపు నిండటం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వాగ్దానాలను గాలి కొదిలేయడం ఎంత వరకు కరెక్ట్ అని ఫైరయ్యారు

కేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో 12 వేల ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు మూసేస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్ లో సన్న బియ్యం, గుడ్లు.. హామీలకు పరిమితమయ్యాయని విమర్శించారు. మరో వైపు పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక నానా తంటాలు పడుతుంటే.. సర్కార్ ఆరోగ్యశ్రీ పథకం అమలుకు పూర్తిగా పడకేసిందని ఆరోపించారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి పూర్తిగా అబద్ధాలు, మోసాలతో ఏడాది పాలన పూర్తిచేసుకుందని విమర్శించారు. ఆర్థిక క్రమశిక్షణ కావాలని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్న కేసీఆర్.. కాంగ్రెస్ ధనిక రాష్టాన్ని చేతిలో పెడితే అప్పుల రాష్ట్రాంగా మార్చారని దుయ్యబట్టారు.

కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో సున్నా మార్కులు వస్తే .. అవినీతిలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిందని హస్తం నేతలు ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వచ్చే నాలుగేళ్లలో ఇచ్చిన హామీలను అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story