తాజా వార్తలు

పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారంటూ మండిపడ్డ టీఆర్ఎస్ నేత

పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారంటూ మండిపడ్డ టీఆర్ఎస్ నేత
X

tummala

ఖమ్మం జిల్లాలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. జిల్లాలో అరాచకాలు లేకుండా చేశామని.. అభివృద్ధే ధ్యేయంగా పనిచేశానని గుర్తుచేశారు. అయినా కొందరు ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం అక్రమ కేసులు పెట్టడం మంచిది కాదని పోలీసులకు తుమ్మల హితవు పలికారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్‌ మండలం ఆరెంపుల గ్రామంలో గత నెల 11న రెండు వర్గాల మధ్య జరిగిన తగాదా రాజకీయ దుమారం రేపుతోంది. 11 మంది టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టారు. మిగతా వారిని వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సబ్‌జైలులోని టీఆర్ఎస్‌ నేతలను తుమ్మల పరామర్శించారు. పోలీసులు వన్‌సైడ్‌గా వ్యవహరించడం మంచిది కాదన్నారు. రాజకీయాల కంటే విలువలు శాశ్వతమని తుమ్మల స్పష్టంచేశారు.

Next Story

RELATED STORIES